గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు.

నామినేషన్ల పరిశీలనను ఆదివారం ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు అధికారులు చేపట్టారు. కొన్ని కేంద్రాల్లో నామినేషన్ల స్క్రూటినీ రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగడం గమనార్హం. నామినేషన్ల దాఖలులో మొదటి రెండు రోజులు మందకోడిగా నామినేషన్లు దాఖలు కాగా.. చివరి రోజు శనివారం పుంజుకున్నాయి. దీంతో ఆదివారం నిర్వహించిన నామినేషన్ల స్క్రూటినీలో విపరీతమైన ఆలస్యం చోటుచేసుకున్న
