కేరళ రూట్లో కొత్త రైలు వచ్చేసింది. తిరువనంతపురం-చర్లపల్లి మధ్య అమృత్‌భారత్ రైలు ప్రారంభమైంది. ఇవాళ ప్రధాని మోదీ ఆ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చర్లపల్లి నుంచి ప్రతి మంగళవారం ఉదయం ఆ రైలు బయలుదేరుతుంది

తిరువనంతపురం: మూడు అమృత్భారత్ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఓ ప్యాసింజెర్ రైలును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ రైళ్లను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు వచ్చే అమృత్ భారత్ రైలును కూడా ప్రారంభించారు. దీనితో పాటు నాగర్‌కోయిల్-మంగుళూరు, తిరువనంతపురం-తాంబరం మధ్య కొత్త అమృత్‌భారత్ రైళ్లు నడవనున్నాయి
