నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడ్తమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రజలు ప్రశ్నిస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నాడు. నిన్న నాకు నోటీసులు ఇచ్చిండు.. నేడు కేటీఆర్కు ఇచ్చిండన్నారు.
మహాలక్ష్మి ఇచ్చే దాకా అడుగుతాం. రైతు రుణమాఫీ అడుగుతాం. నువ్వు అవ్వా తాతలకు రూ.4వేలు ఇచ్చేదాకా అడుగుతం. నువ్వు తులం బంగారం ఇచ్చే దాకా అడుగుతనే ఉంటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటం. నువ్వు ఎ
