Tirumala | తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి .
తిరుమల : తిరుమల (Tirumala) లో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి . టోకెన్లు లేని భక్తులకు 12 నుంచి 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 84,424 మంది భక్తులు దర్శించుకోగా 27,872 మంది తలనీలాలు సమర్పించుకున్నారు

