
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్నగర్ డివిజన్లో ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, ఏఐసీసీ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు కృష్ణ రెడ్డి, నయనా చారి, గిరి ముదిరాజ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రచార సందర్భంగా ప్రజలతో మాట్లాడిన పారిజాత నర్సింహారెడ్డి , జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పథకాలను వివరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రహమత్నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటూ, ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
