
జిల్లెలగూడ శ్రీ మత్స్యవతార వెంకటేశ్వర స్వామి దేవాలయ శివాలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు
మహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో ఉన్న శ్రీ మత్స్యవతార వెంకటేశ్వర స్వామి దేవాలయ శివాలయంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శ్రీ శివపరమాత్మకు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి

ఈ కార్యక్రమం EO శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ గౌడ్, రాకేష్ పంతులు గారి నేతృత్వంలో, దేవస్థాన భక్తి పూర్వకంగా జరిగింది.

ఈ సందర్భంగాజూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ గౌడ్, మాట్లాడుతూ –
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మా ఆలయ సంప్రదాయం. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి దూరదూరాల నుంచి భక్తులు భారీ ఎత్తున విచ్చేస్తారు. సుమారు 500 సంవత్సరాల పురాతనమైన శ్రీ మత్స్యవతార వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. స్వామివారిని దర్శించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది,” అని తెలిపారు.
దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా సంజయ్ గోపాల్ సైంచర్,దేవాలయ కార్యనిర్వాహనాధికారి వై. శ్రీనివాస్ రెడ్డి,జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ గౌడ్, అర్చకులు రాఘవచార్యులు,రాకేష్, రామాచారి, అశోక్ మరియు ఆలయ సిబ్బందికార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు భక్తులందరికీ రాకేష్ పంతులు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
