ప్రపంచ పటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా ఆఫ్రికా ఖండం చీలిపోతున్నది. తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల (భూమి ఫలకాల) కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడబోతున్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు.

హైదరాబాద్, జనవరి 22 : ప్రపంచ పటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా ఆఫ్రికా ఖండం చీలిపోతున్నది. తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల (భూమి ఫలకాల) కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడబోతున్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. అయితే, వాళ్లు ఊహించిన దాని కంటే వేగం గా ఈ పరిణామం జరుగుతున్నట్టు తాజాగా వెల్లడైంది. రానున్న 50 లక్షల ఏండ్ల నుంచి కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యి.. భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం ఉన్నట్టు నాసా, అమెరికా జియోలాజికల్ సర్వే, యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకుల బృందం తెలిపింది.
