కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.

సిరిసిల్ల టౌన్ జనవరి 27: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని 17 వ వార్డులో స్థానిక బీఆర్ఎస్ నాయకులు గుండ్లపల్లి నీరజ – పూర్ణ చందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల కార్యాలయాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమతో కలిసి ఆయన ప్రారంభించారు
