
కింగ్ కోఠి హాస్పిటల్‌పై ఆరోపణలు నిరాధారం : సూపరింటెండెంట్ డా. సంతోష్ బాబు
యాంకర్ వాయిస్ :
కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పిల్లలకు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ పరీక్షలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు ఖండించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, పిల్లలకు నిర్వహించిన అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను చూపించారు. ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరిన పిల్లలందరూ ప్రస్తుతం స్టేబుల్‌గా ఉన్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
లక్షలాది మంది రోగులకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు.
కింగ్ కోఠి హాస్పిటల్లో రెండు అల్ట్రాసౌండ్ మిషన్లు, ఒక సీటీ స్కాన్ యంత్రం అందుబాటులో ఉన్నాయని, అవన్నీ పూర్తిగా వర్కింగ్ కండీషన్లోనే ఉన్నాయని తెలిపారు. నిత్యం సుమారు వంద మందికి స్కానింగ్ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో రోగులకు సేవలు అందిస్తున్నారని, ప్రజలు అనవసరమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్ సంతోష్ బాబు తెలిపారు.
