కాకతీయ యూనివర్సిటీ కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రావాలని కేయూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమకారులు డిమాండ్ చేశారు.

హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీ కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రావాలని కేయూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమకారులు డిమాండ్ చేశారు. శనివారం కేయూ గెస్ట్‌హౌజ్‌లో నిర్వహించిన సమావేశంలో జాక్ నాయకులు మంద వీరస్వామి, వలాఉల్లాఖాద్రీ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన విద్యార్థులు, ఉద్యమకారుల చారిత్రక కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం నిలిచిందని పేర్కొన్నారు. 2009 తెలంగాణ ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు.
