మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎస్సై సురేశ్ కేజీకెఎస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

నర్సింహులపేట, జనవరి 13 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కేజీకేఎస్ మండల అధ్యక్షులు డొనికెన రామన్న, రాష్ట్ర కమిటీ సలహాదారు గునిగంటి మోహన్ తో కలిసి స్థానిక ఎస్సై సురేశ్ కేజీకెఎస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేజీకెఎస్ మండల అధ్యక్షుడు రామన్న మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులందరికి రూ.4వేల పించన్లు పెంచి ఇవ్వాలన్నారు.
