
డిసెంబర్ 29( శ్రీరామ్ చక్రి న్యూస్) ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్‌ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మాజీ సింగల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, రాబోయే నూతన సంవత్సరం బీజేపీకి మరింత శక్తిని అందించే సంవత్సరం కావాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేస్తూ ప్రజల సమస్యలపై పోరాడాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అలాగే నూతన సంవత్సరంలో పార్టీకి మరిన్ని విజయాలు సాధించాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
