ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలు అరికట్టడానికి, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రత్యేక సంసరణలు చేపట్టింది.

ఇచ్చోడ, మే 28 ః ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలు అరికట్టడానికి, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రత్యేక సంసరణలు చేపట్టింది. సామాజిక తనిఖీల్లో అక్రమాలు అరికట్టడానికి కూలీల హాజరును పని ప్రదేశంలో రెండు పూటలా ఆన్లైన్లోనే తీసుకుంటోంది. మరోవైపు ఏడాదికి ఒకసారి నిర్వహించే ఉపాధి హామీ సామాజిక తనిఖీలను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
