ఇరాన్ లో తాజాగా కొందరు దుండగులు ఒక పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపారు. ఈ దృశ్యాన్ని వారు వీడియో కూడా తీయగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇరాన్ లోని ఆగ్నేయ సిస్టాన్-బలూచెస్తాన్ ప్రాంతంలో, బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో తాజాగా కొందరు దుండగులు ఒక పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపారు. ఈ దృశ్యాన్ని వారు వీడియో కూడా తీయగా.. అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇరాన్ లోని ఆగ్నేయ సిస్టాన్-బలూచెస్తాన్ ప్రాంతంలో, బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన పోలీసును మహమౌద్ హగీగట్ గా గుర్తించారు. పోలీసు ఆఫీసర్ ఒక కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. మరో వాహనంలో దుండగులు ఆ కారును వెంబడించారు.

