ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం తప్పిం

అమరావతి : రాజం నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన బోల్తా పడింది. డ్రైవర్ అప్పలగురువుకు పిట్స్ రావడంతో అప్పన్నవలస రహదారిపై బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా మరో 78 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.
