ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పడమే వారి పాలిట శాపమైంది.

హైదరాబాద్ : ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పడమే వారి పాలిట శాపమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన 16 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులు, అక్కపై కత్తితో దాడి చేశాడు. ఆ పై తాను కత్తితో తాను గొంతు కోసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రి వెంకట నాయుడు(48), సోదరి ప్రగతి(20) చనిపోగా తల్లి సౌజన్య దవాఖానలో చికిత్స పొందుతున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
