అంగారక గ్రహంపై నీటి గుహలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. హిబ్రుస్ వాలీస్ ప్రాంతంలో ఆ గుహలు ఉన్నట్లు తేల్చారు. నీటి వల్ల గుహలు ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు.

న్యూయార్క్: అంగారక గ్రహంపై నీటి గుహలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. హిబ్రుస్ వాలీస్ ప్రాంతంలో ఆ గుహలు ఉన్నట్లు తేల్చారు. నీటి వల్ల గుహలు ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. భూమి కాకుండా మరో గ్రహంపై నీటి గుహలను గుర్తించడం ఇదే మొదటిసారి. మార్స్ గ్రహంపై అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడిన గుహలను గతంలో గుర్తించారు. కానీ రాళ్లలోని రసాయనాల వల్ల నీటి గుహలు ఏర్పడినట్లు తాజా రిపోర్టులో తేల్చారు. ద ఆస్ట్రోఫిజికల్ జనరల్ లెటర్స్లో ఈ స్టడీకి చెందిన నివేదిక ఇచ్చారు.
నీటి గుహల ఆవిష్కరణ మార్స్ గ్రహంపై జీవం ఉందన్న ఆధారాలను స్టడీ చేసేందుకు ఊతం ఇచ్చేలా ఉన్నది. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ గుహలు ఏర్పడినట్లు తేల్చారు.
