గూగుల్ మ్యాప్స్‌లో బస్తీలు.. కాలనీలను పరిశీలిస్తాడు.. ఎంచుకున్న కాలనీని గూగుల్ స్ట్రీట్ వ్యూలో మరోసారి పరిశీలించి.. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్తాడు.. అక్కడ టూలెట్ బోర్డులు సమీపంలో తాళం వేసిన ఇండ్లను ఎంచుకొని ఐదు నిమిషాల వ్యవధిలో ఇంటి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న సొత్తును అపహరిస్తున్న అంతరాష్ట్ర హైటెక్ దొంగను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మారేడ్‌పల్లి, జూన్ 4 : గూగుల్ మ్యాప్స్‌లో బస్తీలు.. కాలనీలను పరిశీలిస్తాడు.. ఎంచుకున్న కాలనీని గూగుల్ స్ట్రీట్ వ్యూలో మరోసారి పరిశీలించి.. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్తాడు.. అక్కడ టూలెట్ బోర్డులు సమీపంలో తాళం వేసిన ఇండ్లను ఎంచుకొని ఐదు నిమిషాల వ్యవధిలో ఇంటి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న సొత్తును అపహరిస్తున్న అంతరాష్ట్ర హైటెక్ దొంగను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లోని మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిసిపి శ్రీధర్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
