సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంపై హరీష్ రావు సంచలన ఆరోపణల నుంచి దృష్టిని మరల్చడానికే మంత్రులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.

సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి తనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీ ( DGP ) కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. సింగరేణిని సీఎం బామ్మర్దికి అప్పగించారని ఆరోపించారు. తనపై తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు ఉన్నాయని, సీసీఎస్ డార్క్ సెల్‌తో సహా హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నానని వెల్లడించారు.సింగరేణి కార్మికులు, ప్రజల ఓట్లతో రెండు సార్లు గెలిచాను.ప్రజల దృష్టిని మరల్చడానికి తన వ్యాఖ్యలను చీప్ ట్రిక్ కింద వాడారని విమర్శించారు. .
