
హైదరాబాద్ న్యూస్ బడంగ్పేట్ అక్టోబర్ 18 (శ్రీరామ్ చక్రీ న్యూస్): బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీ రోడ్డు నంబర్ 5లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాజీ కార్పొరేటర్ పెదవై శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సాయినగర్ కాలనీవాసులు ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కాలనీవాసులంతా ఒకే కుటుంబంలా కలిసి పండుగలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. కాలనీవాసులు ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అమ్మవారి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో కాలనీవాసులు మరియు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. భక్తుల సందడితో సాయినగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
