తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వాడవాడలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన దివంగత సాయిచంద్‌కు మరణం లేదని, సాయిచంద్ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.

అమరచింత, జూన్ 29 : తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వాడవాడలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన దివంగత సాయిచంద్‌కు మరణం లేదని, సాయిచంద్ ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. అమరచింత మండలకేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ మూడో వర్ధంతి సభను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన సతీమణి రజనీ సాయిచంద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
