తెలంగాణ ప్రభుత్వం కార్మికులపైనా బెదిరింపులకు దిగింది. ‘విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం (డీమ్డ్ టర్మినేషన్)’ అంటూ జెన్కో యాజమాన్యం ద్వారా అనధికారిక ఉత్తర్వులతో ఒత్తిడి చేసింది.

పాల్వంచ, ఏప్రిల్ 16: తెలంగాణ ప్రభుత్వం కార్మికులపైనా బెదిరింపులకు దిగింది. ‘విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం (డీమ్డ్ టర్మినేషన్)’ అంటూ జెన్కో యాజమాన్యం ద్వారా అనధికారిక ఉత్తర్వులతో ఒత్తిడి చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కార్మికులు గురువారం సమ్మెను విరమించారు. ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారం, ఎన్నికల హామీ ప్రకారం తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం విదితమే. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ (టీవీఏఈ జాక్) పిలుపు మేరకు విధులు బహిష్కరించి పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో సమ్మెను కొనసాగిస్తున్నారు.
