జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నది అంత్య పుషరాలు గురువారం ప్రారంభమయ్యాయి

మహదేవపూర్, మే 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నది అంత్య పుషరాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజైన గురువారం ఉదయం 5:43 గంటలకు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్ వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి తొలి స్నానాన్ని ఆచరిం చి పుషరాలను లాంఛనంగా ప్రారంభించా రు
