భద్రాద్రి జిల్లాలో అంగన్వాడీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బెస్తెడు జీతానికి బారెడు కష్టం చేయాల్సి వస్తోంది. తమ అంగన్వాడీ కేంద్రాల్లోని విధులేగాక గ్రామ పరిధిలోని ప్రభుత్వ సంబంధ పనులన్నీ సర్కారు తమకే చెబుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్త విధులతో అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. భద్రాద్రి జిల్లాలో అంగన్వాడీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బెస్తెడు జీతానికి బారెడు కష్టం చేయాల్సి వస్తోంది. తమ అంగన్వాడీ కేంద్రాల్లోని విధులేగాక గ్రామ పరిధిలోని ప్రభుత్వ సంబంధ పనులన్నీ సర్కారు తమకే చెబుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను బీఎల్వోలుగా, సర్వేయర్లుగా, ఎన్యూమరేటర్లుగా వినియోగించుకుంటూ తమతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నాయని గోడు వెళ్లబోసుకుంటున్నారు.
