శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం

హైదరాబాద్, మే 13: ( శ్రీరామ్ చక్రీ న్యూస్)మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు దేప సురేఖ–భాస్కర్ రెడ్డి దంపతులు విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, కాంగ్రెస్ నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తల్లాటి రమేష్ నేత పాల్గొన్నారు.అలాగే గట్ల రవీంద్ర, జెల్లా జగన్నాథం, ముప్పిడి లింగస్వామి గౌడ్, దోర్నాల చంద్రమౌళి, బొడ్డుపల్లి మహేందర్, సాయికుమార్, రాజశ్రీ రామారావు, వెంకటేశ్వర్లు, సైదులు, వెంకట రమణారెడ్డి, అక్బర్, నబీ, జ్ఞానేశ్వర్, రాఘవేందర్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, కళ్యాణ్ యాదవ్, జహంగీర్, మంచుకొండ శ్రీనివాస్, చిలక రాజ్ సాయికుమార్, జగిని రమేష్, సుదర్శన్, రమేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, డీబీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని దంపతులకు అభినందనలు తెలిపారు.
