ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, సోయాబిన్, కంది, మక్క పంటలను సాగు చేస్తుండగా పత్తి 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు.

ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, సోయాబిన్, కంది, మక్క పంటలను సాగు చేస్తుండగా పత్తి 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు. జూన్ నుంచి డిసెంబరు వరకు సీజన్ కొనసాగుతుండగా సకాలంలో విత్తనాలు నాటికే అక్టోబరు రెండో వారం నుంచి పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. ఏటా మే చివరి వారంలో విత్తనాలు కొని వర్షాల కోసం ఎదురుచూస్తుంటారు. రెండు, మూడు వర్షాల పడి భూముల తడవగానే విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు.
