విద్యార్థుల వసతి గృహాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటే అవుననే చెప్పవచ్చు. వరుసగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై అస్వస్థత పాలవుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు.

ఎర్రవల్లి మం డల కేంద్రంలో ఉన్న ఎస్సీ వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు మరువక ముందే మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతిగృహ విద్యార్థులు ఉప్మాతోపాటు అరటి పండు, బిస్కెట్లు తినడడంతో ఫుడ్ పాయిజన్‌కు గురై 14మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వారికి జిల్లా దవాఖానలో చికిత్స అందించగా కోలుకుంటున్నారు.
