కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కాంటా చేయడంలేదని, వడ్లను తీసుకెళ్లడానికి లారీలు రావడంలేదని ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని హాజీపూర్ సడాక్ తండా రైతులు మంగళవారం ఎల్లారెడ్డి – కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం పోసి నిప్పు పెట్టి, రోడ్డుపై ధాన్యం సంచులు పెట్టుకొని ధర్నా చేపట్టారు.

ఎల్లారెడ్డి రూరల్, మే 26: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కాంటా చేయడంలేదని, వడ్లను తీసుకెళ్లడానికి లారీలు రావడంలేదని ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని హాజీపూర్ సడాక్ తండా రైతులు మంగళవారం ఎల్లారెడ్డి – కామారెడ్డి ప్రధాన రహదారిపై ధాన్యం పోసి నిప్పు పెట్టి, రోడ్డుపై ధాన్యం సంచులు పెట్టుకొని ధర్నా చేపట్టారు. లక్ష్మాపూర్ సెంటర్ పరిధిలోని హాజీపూర్ సడాక్ తండాలో సబ్ సెంటర్ కింద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి కనీసం రోజుకు రెండు లారీలు అవసరం కాగా, ఐదు రోజులుగా ఒక్క లారీ కూడా రాకపోవడతో తూకం వేసిన సంచులు అలాగే ఉన్నాయి
