రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.

హైదరాబాద్ : రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంటా పెట్టాల్సిన వడ్లు(Paddy) అకాల వర్షాలకు కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతులు కన్నీటి పర్యంమవుతున్నారు. ప్రభుత్వ సహకారం లేకున్నా తన స్వేధంతో సేద్యం చేసిన రైతులు కష్టాలను దిగమింగుకొని ధాన్యపు సిరులు పండించారు.
