నగరంలో గ్యాస్ డెలివరీ పేర ఆయా ఏజెన్సీల్లోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సర్వీస్ చార్జి పేరిట వినియోగదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్‌కు చెల్లించాల్సిన ధర కన్నా రూ.20 నుంచి రూ. 50 దాకా అదనంగా చెల్లిస్తేనే సిలిండర్లు అందజేస్తాం..

కలెక్టరేట్, జూలై 5 : నగరంలో గ్యాస్ డెలివరీ పేర ఆయా ఏజెన్సీల్లోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సర్వీస్ చార్జి పేరిట వినియోగదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్‌కు చెల్లించాల్సిన ధర కన్నా రూ.20 నుంచి రూ. 50 దాకా అదనంగా చెల్లిస్తేనే సిలిండర్లు అందజేస్తాం.. లేకుంటే వాపస్ తీసుకెళ్తామంటూ బెదిరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రసీదుపై ఉన్న ధర ప్రకారమే డబ్బులు చెల్లిస్తామంటే ససేమిరా అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. సిబ్బంది ఆగడాలపై ఆయా ఏజెన్సీలు, సంబంధితాధికారులకు ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తున్నారే తప్ప, చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
