మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ఆధ్వర్యంలో మంగళవారం కొమరారం రైతు వేదిక వద్ద రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.

ఇల్లెందు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ఆధ్వర్యంలో మంగళవారం కొమరారం రైతు వేదిక వద్ద రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నాయిని రాజు, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ.2,400 ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు.
