
హైదరాబాద్, మే 15 :(శ్రీరామ్ చక్రిన్ న్యూస్) మైనర్ బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ మీర్పేట్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత బాలరాజు డిమాండ్ చేశారు.ఈ కేసులో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ నంది హిల్స్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారుడు తప్పు చేశాడని తెలిసినా బండి సంజయ్ బాధితురాలిపైనే ‘హనీ ట్రాప్’ అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. “బండి సంజయ్ కుమారుడికి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా?” అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, అలాగే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.బండి సాయి భగీరథ్‌ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
