భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు ఒక గమ్యస్థానమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తమ దేశం ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్‌గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగ వేదిక అని ప్రధాని అభివర్ణించారు

భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు ఒక గమ్యస్థానమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తమ దేశం ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్‌గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగ వేదిక అని ప్రధాని అభివర్ణించారు. భారత్-న్యూజిలాండ్ వ్యాపార, క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ఇరుదేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. సాంకేతికత, సేవలు, రెండు దేశాల మధ్య రాకపోకలు, పెట్టుబడులు సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు.
