వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపవద్దని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణ అన్నారు.

కోటగిరి, జనవరి 13 : వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపవద్దని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో వాహనదారులకు పలు అంశాల పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. డ్రైవింగ్ చేసేవారికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు వాహనం పత్రాలు ఉండాలని సూచించా
