భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం అన్నారు. బీబీనగర్ మండలంలోని మాధారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు..

బీనగర్, మే 19 : భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం అన్నారు. బీబీనగర్ మండలంలోని మాధారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన విత్తన ఉత్పత్తి, భూసార పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన వారోత్సవాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. రైతులు స్వయంగా నాణ్యమైన విత్తన ఉత్పత్తి చేపట్టే విధానాలు, అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై సూచనలు చేశారు. యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న వివిధ విత్తన రకాల వివరాలను తెలియజేశారు.
