
హైదరాబాద్ న్యూస్ మే:18 (శ్రీరామ్ చక్రి న్యూస్)
భూపేష్ గుప్తానగర్ బస్తీ దవాఖానలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో పాటు, హాస్పిటల్లో శుభ్రత కూడా సరిగా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ విషయంపై నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. హాస్పిటల్లో పరిశుభ్రత లోపించిందని, రోగులకు కనీస సౌకర్యాలు కూడా సరిగా అందడం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా, తగిన సదుపాయాలు లేకపోవడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని వారు వెల్లడించినట్లు సమాచారం.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మందులు మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
