నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగులకు అత్యవసర విభాగంలో నిరంతరం చికిత్స అందించాల్సి ఉంటుంది.

ఖైరతాబాద్, మే 31 : నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగులకు అత్యవసర విభాగంలో నిరంతరం చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రతి నిత్యం రోగులు, క్షతగాత్రులతో కిటకిటలాడే ఎమర్జెన్సీ విభాగంలో చికిత్సకు ఉపయోగించే పలు పరికరాల కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆదివారం ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి బెడ్ దొరుకకపోవడంతో స్ట్రెచర్‌పై ట్రీట్మెంట్ చేశారు.
