నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు అక్రమణకు గురవుతున్నాయి.

సారంగాపూర్, మే 24 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు అక్రమణకు గురవుతున్నాయి. అధికారుల అలసత్వం వల్ల అక్రమణదారులు ప్రభుత్వ భూములు చెరబట్టి ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు. 1970 సంవత్సరంలో గ్రామ పరిధిలోని స్వర్ణ నదిపై 2500 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిసరాల్లో ప్రభుత్వ భూమి మిగిలింది. స్వర్ణ గ్రామాన్ని ఆనుకొని కొంత, ప్రాజెక్టు దిగువన మరికొంత భూమి దాదాపు వందల ఎకరాలు మిగిలింది. ఈ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని ఆక్రమిస్తూ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
