సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు(42) హత్య ప్రతీకారంతోనే చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు

సూర్యాపేట టౌన్, మే 25 : సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు(42) హత్య ప్రతీకారంతోనే చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారు హత్యకు వినియోగించిన కత్తి, సెల్ఫోన్లు, కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితురాలు పరారీలో ఉ న్నట్లు తెలిపారు. శనివారం సూర్యాపేట రూరల్ ప రిధిలోని ఎర్కారం గ్రామ శివారులో కల్వర్టు కింద లభించిన మృతదేహం కేసుపై ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు
