ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగవుతున్నది.

ఇల్లంతకుంట మండలంలో 2వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగవుతున్నది. ఈ యేడాది అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా నీళ్లు విడుదల చేయడంతో పత్తికుంటపల్లి, కేశన్నపల్లి, జవారిపేట, గాలిపల్లి, తాళ్లపల్లి గ్రామాల రైతులు సాగు చేశారు. రెండు నెలల క్రితమే పంటను కోసి ఇల్లంతకుంటలోని ఏఎంసీ కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోశారు. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 2,883 క్వింటాళ్లే కొని చేతులెత్తేసింది. దీంతో నెల రోజుల నుంచి కాంటా నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
