ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ ’ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.

దాంతో స్పీకర్ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గందరగోళం కొనసాగింది. దాంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
