కరీంనగర్ జిల్లాలో మక్క రైతులు ఆగమవుతున్నారు. కేంద్రాలకు తెచ్చిన మక్కలు కొనే దిక్కులేక ఆందోళన చెందుతున్నారు. మార్క్‌ఫెడ్ తరపున డీసీఎంఎస్, పీఏసీఎస్‌లు ఆర్భాటంగా తెరిచిన కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక కొనుగోళ్ల తీరు అస్తవ్యస్తంగా మారడంతో గోస పడుతున్నారు.

ఆర్భాటంగా కేంద్రాలను తెరిచిన యంత్రాంగం తగినన్ని సంచులు అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. క్షేత్ర స్థాయిలోని సాగైన పంటకు అధికారుల రికార్డుల్లో క్రాప్ నమోదుకు మధ్య వ్యత్యాసమే ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వానకాలంలో తెరిపిలేని వర్షంతో పత్తి పంట దెబ్బతిన్న రైతులంతా పంట మార్పిడిలో భాగంగా మక్క వేశారు
