బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుతోపాటు ‘సర్’పై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు వేములవాడలో మహారాజ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్లో నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనుండగా, అందుకు జిల్లా నాయకులు అంతా సిద్ధం చేశారు.
