కరీం‘నగరం’ నడిబొడ్డున సర్కారు నిధులతో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది

కరీం‘నగరం’ నడిబొడ్డున సర్కారు నిధులతో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయంలో అధికారులు పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం చర్చనీయాంశమవుతున్నది. ఏకంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) నుంచి రూ.12.50లక్షలు వెచ్చించి విగ్రహాన్ని తయారు చేయించి పెడుతున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. నిబంధనల ప్రకారం మహాత్మాగాంధీతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల తయారీకి మాత్రమే సర్కారు నిధులను వినియోగించుకునే అవకాశం ఉన్నది.
