ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు.

ప్రమాదం ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు.. కొంతమంది డోర్లు పగులకొడుతుండటంతో ఆ శబ్దానికి నిద్రలేచా. ఏం జరుగుతుందని అడిగేలోపే బస్సు మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. ఏమవుతుందో ఏం అర్థంకాలేదు.
ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు. ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడూ జరగకూడదని.. కళ్ల ముందు అలాంటివి చూడకూడదని అన్నారు. దెబ్బకు బస్సు ఎక్కొద్దనే భయం పుట్టిందని చెప్పుకొచ్చారు.
‘ ప్రమాదం జరిగేప్పటికి నేను గాఢ నిద్రలో ఉన్నాను. ప్రమాదం ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు.. కొంతమంది డోర్లు పగులకొడుతుండటంతో ఆ శబ్దానికి నిద్రలేచా. ఏం జరుగుతుందని అడిగేలోపే బస్సు మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. ఏమవుతుందో ఏం అర్థంకాలేదు. ఈలోపే కొంతమంది బస్సు అద్దాలు పగులకొట్టి కిందకు దూకేశారు. ఆ టైమ్లో ఎవరో నన్ను కూడా బయటకు లాగేశారు. నన్ను బయటకు ఎవరు తీసుకెళ్లారో.. నా చెయ్యి పట్టుకుని లాగారా.. కాలు పట్టుకుని లాగారా.. అనేది కూడా అర్థం కాలేదు.
