ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలకు పత్తి రంగు మారింది. తడిసిన పత్తిని ఏరిన రైతులు, దానిని ఆరబెట్టడానికి అవకాశం లేకుండా పోయింది.

ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలకు పత్తి రంగు మారింది. తడిసిన పత్తిని ఏరిన రైతులు, దానిని ఆరబెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. పత్తి తడవడంతో తేమశాతం అధికం ఉండి అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 23 పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండగా, అందులో 22 జిన్నింగ్ మిల్లులను మార్కెటింగ్ అధికారులు పత్తి కొనుగోలుకు నోటిఫై చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో 1,07,459 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఈసారి అధిక వర్షాలకు దిగుబడి సగానికి పైగా తగ్గింది. ఇప్పటి వరకు రైతులు రెండు దఫాలుగా పత్తిని చేను నుంచి ఏరారు.
