తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఈ శాలువాను ఆవిష్కరించారు.

చేనేతతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ తాజాగా.. ఒక శాలువాను రూపొందించారు. తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో ఆయన ఈ శాలువాను నేశారు. ఈ శాలువాను మొబైల్‌తో స్కాన్ చేయడం ద్వారా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, కట్టడాలు, సంప్రదాయాలు అలాగే కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం తెలుసుకోవచ్చు. తెలంగాణ గొప్పతనాన్ని తెలిసేలా నేసిన ఈ శాలువాను తీసుకొని నల్ల విజయ్.. హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శాలువాను కేటీఆర్ ఆవిష్కరించి.. నల్ల విజయ్ను అభినందించారు.
