తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. మూడు దశల్లో జరుగుతున్నాయి. రేపటితో అంటే డిసెంబర్ 17వ తేదీ మూడో దశతో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా చేసేదేమీ లేదన్నారు. కేటీఆర్ పాదయత్ర చేసి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్లలో చేయనిది సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో చేశారని.. పాదయాత్ర చేస్తే కేటీఆర్కు ఈ విషయం అర్థమవుతుందన్నారు.
తాను కష్టపడి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అయితే కేసీఆర్ మనవడు అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారని.. కానీ రేవంత్ మనవడు ప్రయివేట్ కార్యక్రమానికి వచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరించారు.
మరోవైపు డిసెంబర్ 19వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలని హామీలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అంశం, తెలంగాణలో ప్రాజెక్ట్ అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
