రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తెలంగాణ ఉనికికే ముప్పు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కల్వకుర్తి/వెల్దండ, జూన్ 4 : రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తెలంగాణ ఉనికికే ముప్పు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ స్వలాభం కోసం అభివృధ్ధి శిఖరంపై ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిందని ఆమె తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
