మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన తుక్కుగూడ, మంకాల ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులతో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు జిహెచ్ఎంసి విలీనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రాంతాలను జిహెచ్ఎంసిలో కలిపి హైదరాబాద్లో విలీనం చేయడం ఆందోళనకరమని, దీని వల్ల రంగారెడ్డి జిల్లా స్వరూపమే మారిపోతుందని విమర్శించారు. ముఖ్యంగా పాత బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ, తుక్కుగూడ, మంకాల ప్రాంతాలను హైదరాబాద్లో కలపడం వల్ల స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
సరైన ఉద్యమ కార్యాచరణతోనే జిహెచ్ఎంసి హైదరాబాద్ వద్దు సైబరాబాద్ ముద్దు ఖచ్చితంగా సాధించుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలకు ఇప్పటి నుంచే అందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమిష్టిగా పోరాడితే ప్రతి రంగంలో విజయం మనదేనని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జిహెచ్ఎంసిలో విలీనమైన తుక్కుగూడ, మంకాల ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
